చరణ్ పాన్ ఇండియా సినిమా కోసం శంకర్ ఏం చేస్తున్నారంటే..

Published on Apr 22, 2021 3:00 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ పాన్ ఇండియా చిత్రం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. చిత్రాన్ని భారీ లెవల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో అస్సలు తగ్గట్లేదు శంకర్. సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో భాగంగానే వివిధ భాషల నుండి స్టార్ నటులను తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేశారు. కథలో ఒక కీలకమైన పాత్ర ఉందట. దాని కోసం హిందీ నుండి కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను తీసుకురానున్నారు టీమ్.

అలాగే తమిళ మార్కెట్ కోసం ఆ పాత్రలో విజయ్ సేతుపతి దింపుతున్నారు. ఇక కన్నడ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి కిచ్చ సుదీప్ లేదా ఉపేంద్రను సినిమాలోకి తీసుకుంటారట. తెలుగులోకి వచ్చేసరికి ఆసక్తికరమైన వార్తలు వినబడుతున్నాయి. అవేమిటంటే ఆ పాత్రలో చిరు లేదా పవన్ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉందట బృందంలో. కానీ చిరు, చరణ్ కలిసి ‘ఆచార్య’ చేస్తున్నారు. కాబట్టి పవన్ ఫైనల్ అని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఇంకొంతమంది అయితే ఆ పాత్రను చరణే చేస్తాడని చెబుతున్నారు. మరి వీటిలో ఏ వార్త నిజమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :