చరణ్ నుంచి మరో గుర్తుండిపోయే ఐకానిక్ రోల్?

Published on Jun 1, 2021 7:03 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో చరణ్ నిజ జీవిత హీరో అల్లూరి సీతారామరాజు అనే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చరణ్ ఇప్పటి వరకు చేసిన “మగధీర”, “రంగస్థలం” లో చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

వాటిలో ఇమిడిపోయిన చరణ్ నటన తన కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచాయి. మరి ఇప్పుడు అల్లూరిగా కూడా చరణ్ మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకోడానికి సిద్ధంగా ఉండగా.. ఒక నటుడిలోని పరిపూర్ణతతను రాబట్టగలిగే మరి భారీ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ సినిమాలో రోల్ కూడా చరణ్ కెరీర్ లో ఒక బెస్ట్ రోల్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది.

అంతే కాకుండా ఈ చిత్రం కోసం చరణ్ స్పెషల్ మేకోవర్ లోకి కూడా మారనున్నారని తెలుస్తుంది. మరో రెండు నెలల్లో అలా చరణ్ పూర్తిగా కొత్త లుక్ కి సిద్ధం అవుతాడని టాక్. మరి శంకర్ చరణ్ ను ఎలాంటి ఐకానిక్ రోల్ లో చూపించనున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :