‘రాజ‌మౌళి’లాగే శంక‌ర్ కూడా.. !

Published on May 3, 2019 4:00 am IST

టెక్ మాంత్రికుడు శంకర్‌ – లోక నాయకుడు కమల్‌ హాసన్ – కలయికలో భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. కానీ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసే సమయంలో కొన్ని కారణాల వల్ల మధ్యలోనే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత షూటింగ్ ను మళ్లీ ప్రారంభించాలనుకున్నప్పటికీ.. ఎందుకో షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. త్వరలో మళ్ళీ మొదలవ్వనుందని సమాచారం.

అయితే తాజాగా శంకర్ తరువాత సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బాగా హల్ చల్ చేస్తోంది. రాజ‌మౌళి లాగే శంక‌ర్ కూడా ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ ను ప్లాన్ చేస్తున్నారట. త‌మిళ స్టార్ విజ‌య్‌, అలాగే మరో స్టార్ హీరో విక్ర‌మ్ లను హీరోలుగా పెట్టి శంకర్ ఓ సినిమా చేయబోతున్నాడట.

సంబంధిత సమాచారం :

More