స్టార్ డైరెక్టర్ శంక‌ర్‌ను ఇంప్రెస్ చేసిన మూడు సినిమాలు

స్టార్ డైరెక్టర్ శంక‌ర్‌ను ఇంప్రెస్ చేసిన మూడు సినిమాలు

Published on Dec 9, 2020 2:30 AM IST

Shankar1

స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని పాపులర్ దర్శకుల్లో ఆయన కూడ ఒకరు. సినిమాకు సంబందించిన ప్రతి విషయంలోనూ పట్టును కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత. చేసింది కొన్ని సినిమాలే అయినా దాదాపు అన్నీ గొప్ప చిత్రాలే. శంకర్ నుండి సినిమా వస్తుంది అంటే సినీ లవర్స్ తెగ ఖుషీ అయిపోతుంటారు. ఈమధ్య లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. అలా ఆయన చేస్తున్న ‘ఇండియన్ 2’ కూడ ఆగింది.

దీంతో శంకర్ ఇంతకుముందు కంటే సినిమాలు కాస్త ఎక్కువగా చూస్తున్నారు. ఈమధ్య ఆయన్ను కొన్ని సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. వాటి గురించి మాట్లాడిన శంకర్ సుధా కొంగర, సూర్యల ‘సూరరై పొట్రు’ సినిమాలో జీవీ ప్రకాష్ సంగీతం చాలా బాగుందని, ‘అంధగారం’ చిత్రంలో ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ నచ్చిందని అలాగే మలయాళ చిత్రం, ఇటీవలే ఆస్కార్ కు ఇండియా తరఫున నామినేట్ అయిన ‘జల్లికట్టు’ సినిమా యొక్క నేపథ్య సంగీతం చాలా భిన్నంగా, వంక పెట్టడానికి వీల్లేకుండా ఉందని పొగిడారు. శంకర్ లాంటి దర్శకుడి నుండి ప్రశంసలు అందుకుని ఈ సినిమాలు మరొక మెట్టు పైకెక్కాయి.

తాజా వార్తలు