‘అన్నియన్’ వివాదంలో శంకర్ వెనకడుగు వేసేలా లేరు

Published on Apr 16, 2021 3:00 am IST

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ‘అన్నియన్’ చిత్రాన్ని హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే ‘అన్నియన్’ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ పేరు మీద లీగల్ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. ‘అన్నియన్’ కథకు సంబంధించిన అన్ని హక్కులు తన వద్దే ఉన్నాయని, కథను రాసిన సుజాత అనే రచయిత నుండి హక్కులు కొన్నానని, తన అనుమతులు లేకుండా రీమేక్ ఎలా అనౌన్స్ చేస్తారని నోటీసులు పంపారు. తక్షణమే రీమేక్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

దీంతో శంకర్ కూడ స్పందించారు. శంకర్ తాజాగా రవిచంద్రన్ కు రాసిన లేఖలో ‘అన్నియన్’ కథ మీద సర్వ హక్కులు తనవేనని బల్లగుద్ది చెబుతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై శంకర్ అనే ట్యాగ్ మీదనే సినిమా విడుదలైందని, నిర్మాతగా సినిమా ద్వారా మీరు లాభాలు తెచ్చుకున్నారని, కథ, పాత్రలు పూర్తిగా తన సృష్టి అని, అందులో ఇంకెవరి ప్రమేయమూ లేదని అన్నారు. అంతేకాదు రచయిత లేట్ సుజాత కథలో ఇన్వాల్వ్ కాలేదని, ఆయన కథకు మాటలు మాత్రమే రాశారని, తన కథను ఏమైనా చేసుకునే హక్కు తనకు ఉందని పేర్కొన్నారు. శంకర్ వెర్షన్ చూస్తుంటే వివాదంలో ఆయన వెనకడుగు వేసే ప్రసక్తే లేనట్టు కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :