10 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘శంకరాభరణం’

10 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘శంకరాభరణం’

Published on Dec 7, 2015 3:49 PM IST

Shankarabharanam
వరుస విజయాలను అందుకున్న నిఖిల్ హీరోగా కోన వెంకట్ రచన – దర్శకత్వ పర్యవేక్షనలో వచ్చిన సినిమా ‘శంకరాభరణం’. ఈ సినిమా గత శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ భారీ క్రేజ్ మరియు ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కావడం వలన ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మొదటి రోజు 1.7కోట్ల షేర్ మార్క్ ని సాధించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ సాధించింది.

ఈ రోజు ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో కోన వెంకట్ ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని తెలియజేశాడు. ‘శంకరాభరణం మొదటి మూడు రోజుల్లో ఓవరాల్ గా 10 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. అలాగే మొదటి రోజు కలెక్షన్స్ తో పోల్చుకుంటే మూడవ రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. నిదానంగా సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని’ కోన వెంకట్ తెలియజేశాడు. నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించింది. ఉదయ్ నందనవనం డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు