వైజాగ్‌లో ‘శంకరాభరణం’ ఆడియో సక్సెస్ మీట్!

వైజాగ్‌లో ‘శంకరాభరణం’ ఆడియో సక్సెస్ మీట్!

Published on Nov 8, 2015 6:53 PM IST

Sankara-Bharanam
‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’.. లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత నిఖిల్ నటించిన మరో సరికొత్త కథాంశంతో నడిచే సినిమా ‘శంకరాభరణం’ డిసెంబర్ 4న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, మాటలు అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తూ చేసిన సినిమా కావడంతో ‘శంకరాభరణం’ సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ కనిపించింది. బాలీవుడ్ సినిమా పస్‌గయారే ఒబామా మూలకథతో రూపొందిన ఈ సినిమా ఈ సీజన్‌లో వస్తోన్న క్రేజీ సినిమాల్ల్ ఒకటిగా చెప్పుకోవచ్చు.

ఇక ఇప్పటికే టీజర్స్, ట్రైలర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన శంకరాభరణం టీమ్, సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ఆలోచనలో ప్రచార కార్యక్రమాలను కూడా అదేస్థాయిలో చేపడుతోంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్‌లో ఈనెల 15న ఆడియో సక్సెస్ మీట్‌ను నిర్వహించనున్నారు. అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున జరిగే ఈ వేడుక కోసం కోన వెంకట్ టీమ్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఒక ఎన్నారై బీహార్ ప్రాంతంలో చిక్కుకుపోవడమనే అంశం చుట్టూ నడిచే ఈ సినిమా ద్వారా ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిఖిల్ సరసన నందిత హీరోయిన్‍గా నటించగా అంజలి ఓ కీలక పాత్రలో నటించారు.

తాజా వార్తలు