“ఐ”దేళ్ల తర్వాత కూడా మంచి రేటింగ్ రాబట్టిన “ఐ”.!

Published on Aug 6, 2020 12:31 pm IST

ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలవబడే విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటన ఎంత దూరమైనా వెళ్లగలిగే అతి తక్కువ మంది హీరోల్లో ఒకరైన ‘చియాన్’ విక్రమ్ హీరోగా నటించిన రెండో చిత్రం “ఐ”. దీనికి ముందు ఈ ఇద్దరి కాంబోలో “అపరిచితుడు” అనే సెన్సేషనల్ హిట్ రావడం, శంకర్ కూడా అప్పటికే భారీ హిట్లు కొట్టి దీనిని కూడా అంతే స్థాయిలో ప్లాన్ చెయ్యడంతో ఈ చిత్రంపై ఊహించని రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

గత 2015 లో విడుదల కాబడిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది. మొదటి సారిగా శంకర్ సందేశాన్ని పక్కన పెట్టి లవ్ అండ్ రివెంజ్ డ్రామాగా ఈ “ఐ” చిత్రాన్ని తెరకెక్కించగా అది కాస్తా ప్లాప్ అయ్యింది. అయితే ఇప్పటికే ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ గా స్టార్ మా గత వారం తెలుగు స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ అయ్యింది.

ఇన్నేళ్లు గడిచినా సరే ఈ చిత్రానికి మంచి టీఆర్పీ రేటింగే వచ్చిందట. ఈ సినిమా మొట్ట మొదటి వరల్డ్ తెలివిజన్ ప్రీమియర్ కు మన వాళ్ళు 11.1 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ స్థాయి రేటింగ్ రావడం విశేషమే అని చెప్పాలి. ప్రస్తుతం శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ తో “భారతీయుడు 2” తీస్తుండగా చియాన్ “కోబ్రా” మరియు కార్తీక్ సుబ్బరాజ్ లతో ఓ సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More