షణ్ముఖ్‌-దీప్తి సునయన మళ్లీ కలుస్తారట..!

Published on Jan 13, 2022 9:04 pm IST

బిగ్‌బాస్ సీజన్ 5 రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అవుతున్నట్టు న్యూ ఇయర్ రోజున దీప్తి సునయన బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నామని, ఎంతో ఆలోచించి, మేమిద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది. అయితే దీనిపై షణ్ముఖ్ కూడా స్పందిస్తూ బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి దీప్తికి అన్ని హక్కులు ఉన్నాయని, ఈ 5 సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు అని, నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పుకొచ్చాడు.

అయితే వీరిద్దరు మళ్లీ కలిసిపోతే బాగుంటుందని అనుకుంటున్న అభిమానులకు షణ్ముఖ్‌ జశ్వంత్ ఫాదర్ ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షణ్ముఖ్‌ ఫాదర్ మాట్లాడుతూ షణ్ముఖ్‌-దీప్తి ఇద్దరు కలిసే ఉంటారని, దీప్తి బ్రేకప్‌ చెప్పింది కానీ షణ్ముఖ్‌ ఎక్కడా చెప్పలేదని, వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల గురుంచి ఎక్కువగా చర్చించాల్సిన పనిలేదని, వాళ్లు కలవడానికి కొంత సమయం పడుతుందేమో కానీ కలిసే ఉంటారని అన్నారు. అంతేకాకుండా ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అని, అంతా శుభమే జరుగుతుందని, ఈ విషయంలో అభిమానులు అనుమానించాల్సిన అవసరమే లేదని అన్నాడు.

సంబంధిత సమాచారం :