నేను చెప్పేవరకు నమ్మకండి.. బిగ్‌బాస్ ఎంట్రీపై షణ్ముక్ క్లారిటీ..!

Published on Aug 10, 2021 10:00 pm IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్-5 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఐదో సీజన్‌ లోగోని నిర్వాహకులు విడుదల చేశారు. సెప్టెంబర్ 5వ తేది నుంచి ఈ షో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతీ సీజన్ లాగానే ఈ సారి హౌస్‌లోకి వెళ్ళేది వీరే అంటూ పలు జాబితాలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ లిస్ట్‌లో యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్ జస్వంత్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. బిగ్‌బాస్ ఎంట్రీ కోసం షణ్ముక్ జస్వంత్‌కు కోటి రూపాయల రెమ్యునరేషన్‌ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా షణ్ముక్‌కి అంత మొత్తంలో రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి నిర్వాహకులు సుముఖత వ్యక్తం చేయడం లేదని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై స్పందించిన షణ్ముక్ నెగిటివ్‌ కామెంట్లు నాకు కొత్త కాదని, నేను చెప్పేవరకు వేటినీ నమ్మకండని చెప్పుకొచ్చాడు. దీంతో అసలు బిగ్‌బాస్ హౌస్‌లోకి షణ్ముక్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ఇంకా క్వశన్ మార్క్‌గానే అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :