శర్వానంద్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఖరారు !
Published on Mar 5, 2018 2:29 pm IST

హను రాగావపుడి దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తోన్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో శర్వానంద్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని సమాచారం. రేపు ఇ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు పడిపడిలేచే మనసు టైటిల్ పరిశీలనలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు పడిపడి లేచే మనసు టైటిల్ ఖరారు చేసారు చిత్ర యూనిట్.

రేపు అదే టైటిల్ ను విడుదల చెయ్యబోతున్నారు దర్శక నిర్మాతలు. విశాల్చంద్ర శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. రెండు విబిన్న పాత్రల్లో శర్వానంద్ ఈ మూవీ లో కనిపించబోతున్నాడు. శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

 
Like us on Facebook