శర్వానంద్ బర్త్ డే స్పెషల్.. ప్రీ లుక్ అదిరింది !

Published on Mar 5, 2019 7:33 pm IST

ప్రస్తుతం హీరో శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోబోతుంది. కాగా రేపు శర్వానంద్ తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. దాంతో చిత్రబృందం శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ ప్రీ లుక్ పోస్టర్ లో శర్వానంద్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఇక ఈ చిత్రంలో చాలా భాగం విదేశాలలో చిత్రీకరించబడింది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా విడుదల చేయనుంది చిత్రబృందం.

ఇక ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామా సంబంధించిన నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ తో పాటు కళ్యాణి ప్రియదర్శిని కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :

More