సినిమా హిట్ కావాలని శ్రీవారిని దర్శించుకున్న యంగ్ హీరో !

Published on Dec 20, 2018 12:14 pm IST

యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈచిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా సినిమా విజయం సాధించాలని శర్వా మరియు నిర్మాతలు తిరుపతి కి వెళ్లి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. హను రాఘవ పూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. రొమాంటిక్ ఎంటర్టైనెర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సాయిశర్వా -సాయి పల్లవి ల కెమిస్ట్రీ హైలైట్ కానుంది.

ఇక మొదటి సారి వీరిద్దరు కలిసి నటించిన చిత్రం కావడంతో ఈసినిమా కు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :