జనవరి నుండి శర్వానంద్ సినిమా మొదలు !

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఫిదా’ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సాయి పల్లవికి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాక మరిన్ని సినిమాలు చేసేలా అవకాశాలను సంపాదించి పెట్టింది. తాజాగా ఈ హీరోయిన్ తమిళ్ లో సూర్య సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లేటెస్ట్ గా శర్వానంద్ సినిమాలో సాయి పల్లవి నటించబోతోందని సమాచారం. హను రాగావపుడి దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ఇటివల ప్రారంభం అయ్యింది. సాయి పల్లవి నటించిన ఎంసిఎ చిత్రం ఇటివల విడుదలై మంచి విజయం సాధించింది. ‘మహానుభావుడు’ సినిమా తరువాత శర్వానంద్ నటించబోతున్న సినిమాకు హను రాగాపుడి దర్శకుడవ్వడం విశేషం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 20 నుండి మొదలుకానుంది.