శర్వానంద్ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 9, 2019 2:00 am IST

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తోన్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామాకు సంబంధించిన నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందట. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చిత్రబృందం ఈ సినిమాను మే 31వ తేదీన విడుదల చెయ్యాలని చూస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో చాలా భాగం విదేశాలలో చిత్రీకరిస్తోన్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ తో పాటు కళ్యాణి ప్రియదర్శిని కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :