స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వానంద్ కొత్త చిత్రం !

Published on Feb 27, 2019 9:36 pm IST


పడి పడి లేచె మనసు తరువాత ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్, ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా స్పెయిన్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది. గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ , ‘హలో’ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తునాడు. ఈ చిత్రానికి దళపతి అనే టైటిల్ ను పరిశీలనలో వుంది.

ఇక ఈ చిత్రంలో శర్వా ద్వి పాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఒకటి యువకుడి పాత్ర కాగా మరొకటి వృద్దుడి పాత్రా. ఈసినిమా తరువాత శర్వా , సమంత తో కలిసి 96 రీమేక్ లో నటించనున్నాడు.

సంబంధిత సమాచారం :