ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ హీరో నటించడం లేదు !
Published on Mar 7, 2018 10:37 am IST

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న ‘ఎన్టీఆర్’ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సాయి కొర్రపాటి నిర్మించబోతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. మార్చి 29 న రామకృష్ణ స్టూడియో లో ఈ సినిమా ప్రారంభంకానుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ యంగ్ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ శర్వానంద్ ఈ సినిమాలో నటించడం లేదని ఆ పాత్ర ఎవరు చెయ్యబోతున్నారనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. బాలయ్య 72 విభిన్న వేషధారణల్లో కనిపించబోతున్న ఈ సినిమాలో పాత కాలం నటులు, రచయితలు, రాజకీయ నాయకుల పాత్రలు కూడ ఉండబోతున్నాయి.

 
Like us on Facebook