మన టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం నారీ నారీ నడుమ మురారి తో మంచి హిట్ ని ఈ ఏడాది తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి పూర్తి భిన్నంగా మరో రెండు సినిమాలు ఈ ఏడాదిలో తన నుంచి రానున్నాయి. ఇక ఆ చిత్రాల్లో ఒకటే దర్శకుడు సంపత్ నందితో చేస్తున్న చిత్రం “భోగి”.
ఈ సినిమాలో శర్వానంద్ పూర్తిగా మాస్ లుక్ లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ ని కూడా అందుకోగా లేటెస్ట్ గా తన బర్త్ డే సందర్భంగా మరో స్పెషల్ పోస్టర్ ని మేకర్స్ ఇప్పుడు వదిలారు. మరి ఇందులో శర్వానంద్ మరింత డైనమిక్ గా రఫ్ లుక్ లో తాను కనిపిస్తున్నాడు.
ఇక దర్శకుడు తానా హీరోపై ఎలివేషన్ ఇస్తూ మొన్న గంగని చూసారు ఇప్పుడు పెను గంగని చూడండి అంటూ తన హీరోకి బర్త్ డే విషెస్ తెలిపారు. మరి ఈ సినిమాలో శర్వానంద్ ఏ రకంగా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ అలాగే డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తుండగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు, అలాగే శ్రీ శ్రీనివాస సాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఆగస్ట్ 28న సినిమా విడుదల చేస్తున్నారు.
మొన్న గంగని చూసిర్రు..
ఇయ్యాల పెనుగంగని సూడుర్రి💥Happiest Birthday to my G.A.N.G.A, Charming Star💫@ImSharwanand garu 💐✌🏾🫶🏽
A man who gives his absolute all to what he believes in & an ever-surprising powerhouse ✨🫡#HBDSharwanand #BHOGI
A #SharwaSampathBloodfest❤️🔥… pic.twitter.com/HEU1aEgXoZ— Sampath Nandi (@IamSampathNandi) March 6, 2026


