శర్వానంద్ తమిళ సినిమాకి అంతా సెట్టైంది

Published on Jun 12, 2019 8:20 pm IST

బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు యువ హీరో శర్వానంద్. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమా చేస్తున్న ఈయన తమిళ హిట్ చిత్రం ’96’ తెలుగు రీమేక్ కూడా చేస్తున్నారు. ఆఖరి దశ పనుల్లో ఉన్న ‘రణరంగం’ ఆగస్టు 2న విడుదలకానుండగా 96 రీమేక్ ఆగష్టు నెలాఖరుకి పూర్తవుతుంది. దీంతో ఇంకో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వా.

అయితే ఇది తెలుగు సినిమా కాదు.. డైరెక్ట్ తమిళ చిత్రం. ఈ చిత్రాన్ని కొరియోగ్రఫర్ రాజు సుందరం డైరెక్ట్ చేయనున్నారు. కొన్నిరోజులుగా చర్చల దశలోనే ఉన్న ప్రాజెక్ట్ అన్ని అంశాలు అనుకూలించడంతో సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీ అయింది. ఈ ఏడాది ఆఖరులో చిత్రం మొదలయ్యే సూచనలున్నాయి. 2011లో చేసిన ‘ఎంగేయుమ్ ఇప్పోతుమ్’ (తెలుగులో జర్నీ) తర్వాత శర్వా చేస్తున్న తమిళ చిత్రం ఇదే కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

More