కొత్త దర్శకుడి తో యంగ్ హీరో !

Published on May 1, 2019 9:22 am IST

పడి పడి లేచె మనసు తరువాత యంగ్ హీరో శర్వానంద్ వరస సినిమాలను లైన్లో పెడుతున్నారు. అందులో భాగంగా ఇటీవల స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ డ్రామా లో నటించాడు శర్వానంద్. ప్రస్తుతం ఈచిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటించనున్నారు. ఇక ఈ చిత్రం తరువాత శర్వా ప్రస్తుతం 96తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ కెన్యా లో జరుగుతుంది.

ఇక ఇప్పుడు శర్వా తాజాగా ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్రాన్ని ఓ నూతన దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More