“ఆడవాళ్ళు మీకు జోహార్లు” టైటిల్ సాంగ్ పోస్టర్ తో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన టీమ్

Published on Feb 1, 2022 7:00 pm IST

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం తన రాబోయే సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రష్మిక మందన్న ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు చిత్ర నిర్మాతలు సినిమా నుండి మొదటి పాట అయిన టైటిల్ సాంగ్‌ను ఫిబ్రవరి 4, 2022న సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.

కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు ఫిబ్రవరి 25, 2022న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :