‘సంక్రాంతి’ సీజన్ ని టార్గెట్ చేసిన మరో యంగ్ హీరో

‘సంక్రాంతి’ సీజన్ ని టార్గెట్ చేసిన మరో యంగ్ హీరో

Published on Nov 10, 2015 4:03 PM IST

Sharwanand
కెరీర్ మొదట్లో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యంగ్ హీరో శర్వానంద్. ఈ మధ్య కాలంలో శర్వానంద్ తన రూటు మార్చి కమర్షియల్ గా సక్సెస్ అయ్యే వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ బాక్స్ ఆఫీసు వద్ద విజయాలను అందుకుంటున్నాడు. అలా ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శర్వానంద్ నుంచి రానున్న మరో డిఫరెంట్ ఫిల్మ్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’. తెలుగులో బాగా తక్కువగా వచ్చిన రోడ్ జర్నీ ఫార్మాట్ లో చేసిన చేసిన సినిమానే ఇది.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేసారు. చాలా ఫ్రెష్ గా, ఫన్నీగా ఉన్న ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ చిత్ర టీం ‘ఎక్స్ ప్రెస్ రాజా’ని జనవరి సీజన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందులోనూ ఎక్కువ భాగం సంక్రాంతి సీజన్ అయితే హాలిడేస్ వలన ఓపెనింగ్స్ బాగా వస్తాయని ఈ సీజన్ ని టార్గెట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. శర్వానంద్ సరసన సురభి హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాని సూపర్ హిట్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

తాజా వార్తలు