సమీక్ష: నారీ నారీ నడుమ మురారి –  మంచి ఫన్ తో సాగే ఫామిలీ డ్రామా

సమీక్ష: నారీ నారీ నడుమ మురారి –  మంచి ఫన్ తో సాగే ఫామిలీ డ్రామా

Published on Jan 16, 2026 2:03 AM IST

Nari-Nari-Naduma-Murari

విడుదల తేదీ : జనవరి 14, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య, శ్రీ విష్ణు, సత్య తదితరులు
దర్శకుడు : రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం : జ్ఞానశేఖర్ విఎస్, యువరాజ్
కూర్పు : రామ్ అబ్బరాజు

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఏ మేరకు ఆడియెన్స్ ని అలరించిందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక ఆర్కిటెక్ గా వర్క్ చేసే గౌతమ్ (శర్వానంద్) ప్రముఖ లాయర్ రామ లింగయ్య (సంపత్) కూతురు నిత్య (సాక్షి వైద్య) ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ వారు పెళ్లికి మాత్రం హంగామా లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్ పెడతారు. కానీ ఆ కండిషన్ దెబ్బతో గౌతమ్ కి అసలు సమస్య ఎదురవుతుంది. మరి ఆ సమస్య ఏంటి? ఎందుకు రిజిస్టర్ పెళ్లికి తను రెడి కాలేక పోతాడు? ఈ క్రమంలో దియా (సంయుక్త) కి గౌతమ్ కి ఉన్న లింక్ ఏంటి? చివరికి గౌతమ్ నిత్యాని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో కొన్ని చోట్ల డీసెంట్ ఫన్ మూమెంట్స్ కనిపిస్తాయి. శర్వానంద్ కామెడీ టైమింగ్ యాజిటీజ్ గా ఫ్లో లో వెళ్ళిపోతుంది. అంతే కాకుండా లీడ్ హీరోయిన్స్ తో కలిపి ముగ్గురికి ఉండే సన్నివేశాలు సెకండాఫ్ లో అక్కడక్కడా రిలీఫ్ గా అనిపిస్తాయి.

వీరి ముగ్గురు నడుమ జెనరేట్ అయ్యే ఫన్ ఆ కన్ఫ్యూజన్ అందులో నలిగిపోయే హీరోగా శర్వానంద్ మంచి నటన కనబరిచాడు. తన లుక్స్ స్టైలింగ్ ఈ సినిమాలో ఉంది. ఇద్దరు హీరోయిన్స్ కూడా తమ పాత్రల్లో వాటికి కావాల్సిన రీతిలో నటించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ ఇంకా కమెడియన్ సత్యా ఫన్ ట్రాక్ లు కూడా డీసెంట్ ఫన్ ని అక్కడక్కడా జెనరేట్ చేస్తాయి.

తమ రోల్స్ లో వారు కూడా బాగా చేశారు. వీరితో పాటుగా సుదర్శన్, నటుడు సంపత్, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రల్లో వాటి పరిధి మేరకు బాగా చేశారు. అలాగే ఒక్క చోట ఎమోషనల్ పర్లేదు అనిపిస్తుంది. శ్రీవిష్ణు కామియో రోల్ బాగుంది. తన రోల్ వచ్చాక కొంచెం కథనం తన టేకోవర్ లోకి తీసుకున్నాడు. తను కనిపించిన ఆ కొన్ని సీన్స్ కొంచెం రిలీఫ్ అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో బలమైన కథనం లోపించింది. ఎక్కడో కొన్ని చోట్ల కామెడీ అది కూడా ఒకటీ రెండు సీన్స్ ఇంకా చాలా తక్కువ వన్ లైనర్స్ వర్కౌట్ అవుతాయి కానీ మిగతా సినిమా అంతా చాలా ఫ్లాట్ గా ఉంటుంది. ఒక టైం లో సామజవరగమన తీసిన దర్శకుడేనా ఇది తీసింది అనిపిస్తుంది.

తన విషయంలో ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే ఆ సినిమా రేంజ్ లో ఇది ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువే కనిపిస్తాయి. అలాగే ఫస్టాఫ్ ఇంకా సెకండాఫ్ లో నవ్వు తెప్పించని సీన్స్ చాలానే ఉన్నాయి. హీరోయిన్ సాక్షి వైద్య కొంచెం డల్ గా కనిపిస్తుంది.

అలాగే ఈ తరహా పాయింట్ లో ఇంకా మంచి ఫన్ ని జెనరేట్ చేసే ఛాన్స్ ఉంది కానీ అందుకు తగ్గ కథనం, సీన్స్ ఇందులో లోపించాయి. అలాగే కొంచెం పికప్ అయ్యిన తర్వాత మళ్ళీ కొంత సమయం తర్వాత కథనం రొటీన్ గానే అనిపిస్తుంది. అలాగే కొంత సమయం తర్వాత లీడ్ జంట ముగ్గురు నడుమ సీన్స్ కూడా బోర్ కలిగిస్తాయి. అంతే కాకుండా నరేష్, సిరి హనుమంతు ట్రాక్ కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంజాయ్ చేయలేకపోవచ్చు. వీటి అన్నిటికీ మించి కథనం చాలా ఊహాజనితంగా వెళ్ళిపోతుంది. సో ఎక్కడా అంత ఎగ్జైటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా సగటు ప్రేక్షకుడికి అనిపించదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఖర్చు కనిపిస్తుంది. అలాగే విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ వర్క్ యావరేజ్ గా ఉంది. క్లైమాక్స్ లో స్కోర్ బాలేదు. యువరాజ్, జ్ఞానశేఖర్ వి ఎస్ ల కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది.

ఈ చిత్రానికి మాస్ జాతర దర్శకుడు భాను భోగవరపు కథ అందించడం జరిగింది. నిజానికి ఇందులో కోర్ పాయింట్ ఓకే కానీ కథనం మాత్రం ఇంకా బలంగా డిజైన్ చేసుకోవాల్సింది. తన గత సినిమా పరంగా దర్శకుడు రామ్ అబ్బరాజుపై కొన్ని అంచనాలు అయితే ఇందులో రీచ్ కాలేదు అని చెప్పక తప్పదు. ఏవో కొన్ని కామెడి సీన్స్ తప్పితే మిగతా కథనం అంతా చాలా చప్పగా నడిపించారు. ఇంకా బెటర్ సీన్స్ ని తను ప్లాన్ చేసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “నారీ నారీ నడుమ మురారి” ఒక హిలేరియోస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. శర్వానంద్ తన రోల్ లో బాగా చేసాడు. అలాగే ఇందులో కోర్ పాయింట్ బాగుంది. దానికి అనుగుణంగా డిజైన్ చేసిన కామెడి సీన్స్ నరేష్ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సత్య, వెన్నెల కిషోర్ పై సన్నివేశాలు బాగున్నాయి. ఇలా కామెడీ ఇంకా ఎమోషన్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతాయి. సో ఈ సినిమా అలరిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు