‘మహానుభావుడు’ సినిమా తర్వాత యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న సినిమాల్లో సుధీర్ వర్మ చిత్రం కూడ ఒకటి. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నెల ఆరంభంలో ఈ సినిమా యొక్క వైజాగ్ షెడ్యూల్ మొదలై ఈరోజుటితో ముగిసింది. తర్వాతి షెడ్యూల్ ను కాకినాడలో చేయనున్నారు టీమ్.
గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. ఈ చిత్ర కాకుండా శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమా చేస్తున్నాడు.


