త్వరలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో హీరోయిన్ పెళ్లి !

Published on Jan 5, 2019 8:00 am IST

తేజ దర్శకత్వం వహించిన ‘1000 అబద్దాలు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా. ఆ తరువాత ‘భీమవరం బుల్లోడు, జయ జానకి నాయక’ వంటి చిత్రాల్లో ఎస్తేర్ నొరోన్హా నటించింది. కాగా ఎస్తేర్ త్వరలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకోబోతుంది.
‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన నటుడు మరియు సింగర్ నోయెల్ ను ఆమె పెళ్లి చేసుకోనుంది.

కాగా ఎస్తేర్ నొరోన్హా మంగలూర్ కు చెందిన కొంకణి అమ్మాయి. భరతనాట్యంతో పాటు ఆమె పాటలు కూడా పాడుతుంది. మొత్తానికి నోయెల్ – ఎస్తేర్ ఓ ఇంటి వారు కాబోతున్నారు.

ఈ విషయాన్ని నోయెలే తన ట్వీటర్ లో పోస్ట్ చేస్తూ.. మేము ఇద్దరంగా ఉన్నా ఒకటే. తను నా హార్ట్ క్వీన్’ అంటూ పోస్ట్ చేశాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :