“బిగ్ బాస్ 5”..రవిని సిల్లీ పాయింట్ తో నామినేట్ చేసిందా?

Published on Nov 23, 2021 1:36 pm IST

ఇప్పుడు మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇప్పుడు మరింత రసవత్తరంగా మారుతుంది. ఒక్కో వారం ఒక్కో ఎలిమినేషన్ తో ఆసక్తిగా మారిన వీకెండ్ ఎపిసోడ్స్ అలాగే ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియలు మరింత టెన్స్ వాతావరణం బిగ్ బాస్ హౌస్ లోని అలాగే చూసే వీక్షకుల్లో నెలకొల్పుతుంది. అయితే నిన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలు మరింత ఇంట్రెస్టింగ్ గా జరిగాయని చెప్పాలి.

అయితే యాంకర్ రవి విషయంలో కంటెస్టెంట్ సిరి తీసుకున్న స్టాండ్ కానీ ఆమె అతడిని ఓ పాయింట్ పై చేసిన నామినేషన్ కానీ రవిని రెగ్యులర్ గా ఫాలో అవ్వని వారికి కూడా ఒకింత సిల్లీగా అనిపించవచ్చు. మొన్న ఆదివారం గోల్డ్, కోల్ లలో ఆమెకు కోల్ ఇచ్చాడు అనే నెపంతోనే అతడిని నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం చాలా సిల్లీగా అనిపించి అక్కడే ఆమె నామినేషన్ తేలిపోయింది.

రవి కోల్ ఎందుకు ఇచ్చాడో ఒక ప్రాపర్ రీజన్ చెప్పాడు. కానీ సిరి రవిని ఎందుకు నామినేట్ చేసిందో సరైన వివరణ ఇవ్వలేకపోయింది. ఇక్కడే ఆమె నామినేషన్ కావాలనే ఇచ్చినదానిలా అనిపిస్తుంది అని నెటిజన్స్ కామెంట్ కూడా.

సంబంధిత సమాచారం :

More