కరోనా పై అవగాహన కల్పిస్తున్న ఏస్ కొరియోగ్రాఫర్

Published on Apr 2, 2020 5:08 pm IST


కరోనా వైరస్ వ్యాప్తి దేశాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లోకి వెళ్ళింది. కరోనా వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఇండియాలో 21రోజులు టోటల్ లాక్ డౌన్ ప్రకటించగా.. అన్ని పరిశ్రమలు, సంస్థలు, సినిమా థియేటర్స్, షాపింగ్స్ మాల్స్ మూసివేయడం జరిగింది. కరోనాను అరికట్టడానికి ప్రత్యేకమైన మందు లేని తరుణంలో ఇంటిలోనే ఉండి, సోషల్ డిస్టెన్స్ పాటించడమే ఏకైక మార్గంగా ప్రభుత్వాలు సూచనలు ఇస్తున్నాయి.

దీనిపై ప్రజల్లో అవగహన కల్పించడానికి ప్రముఖులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక టాలీవుడ్ ఏస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొడుకుతో కలిసి ఓ స్పెషల్ డాన్స్ వీడియో ద్వారా తెలియజేశారు. ‘చేతులెత్తి మొక్కుతా…చేయి చేయి కలుపకురా..’సాంగ్ కి ఆయన డాన్స్ చేసి సోషల్ డిస్టెన్స్ ఎంత అవసరమో తనశైలిలో తెలియజేశారు.

సంబంధిత సమాచారం :

X
More