ధనుష్-శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్?

Published on Aug 11, 2021 3:00 am IST

టాలీవుడ్‌లో క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ పాన్ ఇండియన్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే శ్ఖర్ కమ్ముల ధనుష్‌ను ఏ తరహా కథతో చూపబోతున్నారన్న అమశం గతంలో హాట్ టాపిక్‌గా మారింది. శేఖర్ కమ్ముల అనగానే లవ్ జానర్‌లోనే సినిమా చేస్తాడని తొలుత ప్రచారం జరిగింది. ఆ తర్వాత పొలిటికల్ డ్రామాగా తీయబోతున్నాడని ప్రచారం జరిగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒకప్పటి మద్రాసు నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా అని మాకు తెలిసింది. ఆ కారణంగానే శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం మొదట ధనుష్‌ని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్స్ కూడా దాదాపు పూర్తైనట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను నారాయణదాస్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌ రావు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :