
నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో రాబోతున్న ‘ముకుంద’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమందిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం ట్రైలర్లు కూడా ప్రజాదరణ పొందాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం లో శేఖర్ కమ్ముల అతిధి పాత్ర పోషించనున్నాడు.
డిసెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రం లో శేఖర్ చిన్న సీన్ లో కనిపిస్తారు. వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని టాగోర్ మధు నల్లమలుపు బుజ్జి నిర్మించారు.