అక్టోబర్ 30న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ‘షేర్’

అక్టోబర్ 30న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ‘షేర్’

Published on Oct 27, 2015 9:56 AM IST

sher1
ఈ ఏడాది మొదట్లోనే పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్ ‘పటాస్’ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించి చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ అందుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆ సినిమా విజయంతో నూతన ఉత్సాహంతో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది మరో సినిమాతో సందడి చేయడానికి సిద్దమయ్యాడు. అదే ‘షేర్’. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ తెచ్చుకుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాత కాస్ట్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు.

ఎట్టకేలకు ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ క్లియర్ చేసుకొని అక్టోబర్ 30న షేర్ సినిమాని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ రోజు నుంచి ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ చాలా జోరుగా సాగనున్నాయి. కళ్యాణ్ రామ్ అండ్ టీం ఈ సినిమా అకూడా పటాస్ లానే ప్రేక్షకులను మెప్పిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎస్ఎస్ తమన్ అందించిన ఆడియోని ఇటీవలే ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు.

సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ ని కూడా టచ్ చేసారట. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కొమర వెంకటేష్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు