
శ్రీ రామ్, లక్ష్మీ రాయ్, సుమన్, వడివుక్కరసి,రేఖ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న హర్రర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ‘శివ గంగ’ ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు శనివారం హైదరాబాద్, జూబ్లిహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో అతిరధ మహారధుల నడుమ ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెఖరులో విడుదలకు సిద్దమైయింది. ఈ ఆడియో ఫంక్షన్ కు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రానికి ‘జాన్ పీటర్’ సంగీతాన్ని సమకూర్చగా.. గీత రచయితలు వనమాలి, వెలిదండల్ పాటలు అందించారు. కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్ పై వి.సి.వడి ఉడయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె.శివనాథ్, మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు శివనాథ్, మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ’ మా సంస్థ నుండి వస్తున్న తొలి చిత్రం ఇదే. దర్శకుడు వి.సి.వడి ఉడయాన్ సినిమాను హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించారు. చిత్రంలోని యాక్షన్ సీన్స్, 37 నిముషాలు పాటూ ఉండే గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జాన్ పీటర్ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ నెలాఖరులో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాము’ అన్నారు.
దర్శకుడు వి.సి.వడి ఉడయాన్ మాట్లాడుతూ ‘జాన్ పీటర్ మంచి సంగీతం అందించారు. చిత్రంలో శ్రీ రామ్ డ్యూయల్ రోల్ లో అద్బుతంగా నటించారు. అలాగే లక్ష్మీ రాయ్ తన నటనతో ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర నిర్మాతలకు నా అభినందనలు. హై టెక్నికల్ వాల్యూస్ తో తీసిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జాన్ పీటర్ మాట్లాడుతూ ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన వి.సి.వడి ఉడయాన్ గారికి, నిర్మాతలకు నా ధన్యవాదాలు. మంచి పాటలు కుదిరాయి. నా సంగీతానికి తగ్గట్టు గీత రచయితలు వనమాలి, వెలిదండల్ మంచి పాటలు అందించారు. సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.
హీరో శ్రీ రామ్ మాట్లాడుతూ’ వి.సి.వడి ఉడయాన్ సినిమాను చాల బాగా తీశారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాను హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. జాన్ పీటర్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ హర్రర్ యాక్షన్ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అన్నారు.
కార్యక్రమానికి హాజరైన హోం మంత్రి నాయిని, రసమయి బాలకిషన్ సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్వించారు. అలాగే చిత్ర నిర్మాతలకూ, దర్శకుడికీ, నటీ నటులకు, శుభాకాంక్షలు తెలిపారు. హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి చేతుల మీదుగా ఆడియో ఆవిష్కరణ జరిగింది.
శ్రీ రామ్, లక్ష్మీ రాయ్, సుమన్, వడివుక్కరసి, రేఖ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫైట్స్: కణాల్ కణ్ణన్, కెమెరా:ఎస్. శ్రీనివాస్ రెడ్డి, మాటలు:ఎమ్. రాజశేఖర్ రెడ్డి, ఎడిటర్: ఎలీసా, ఆర్ట్: దేవరాజ్, పి.ఆర్.ఓ: జి.యస్ మీడియా, దర్శకత్వం: వి.సి.వడి ఉడయాన్.

