క్లైమాక్స్ లో ఆమె నటన అద్భుతం – శివ నిర్వాణ

Published on Apr 16, 2019 10:01 pm IST


శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య – సమంత జంటగా ఏప్రిల్ 5వ తేదీన వచ్చిన ‘మజిలీ’ అద్భుతమైన వసూళ్లతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి మంచి లాభాలను తీసుకొస్తుంది. దాంతో చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

కాగా ఈ సక్సెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ వచ్చిన అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్.. చైతుగారు ఈ సినిమా కి న్యాయం చేశారు. సమంతగారు చాలా మంచి మనిషి.. క్లైమాక్స్ లో ఆమె నటన అద్భుతం.. ఈ సినిమా కి చైతన్య, సమంత గారు లైఫ్ ఇచ్చారు. తమన్ గారు చేసిన హెల్ప్ మాటల్లో చెప్పలేను.. అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అని తెలిపారు.

సంబంధిత సమాచారం :