రేపు మధ్యాహ్నం 2 గంటలకు మహా ప్రస్థానం లో శివ శంకర్ మాస్టర్ మృతదేహానికి అంత్యక్రియలు

Published on Nov 28, 2021 11:04 pm IST

కరోనా వైరస్ సోకడం తో అనారోగ్యం భారిన పడిన శివ శంకర్ మాస్టర్ నేడు రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ మృతదేహానికి రేపు మధ్యాహ్నాం 2 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంతకుముందు మణికొండ పంచవటి కాలనీలోని తమ నివాసంలో అభిమానుల సందర్శనార్థం శివశంకర్ మాస్టర్ మృతదేహాన్ని ఉంచి నివాళులర్పించనున్నారు.

శివశంకర్ మాస్టర్ చనిపోయేముందు కొవిడ్ నెగిటివ్ గా నిర్దారించిన ఏఐజీ వైద్యులు. నెగటివ్ వచ్చినప్పటికీ మృతి చెందడం తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేపు ఉదయం 5 గంటలకు శివశంకర్ మాస్టర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్న వైద్యులు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :