పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రామ్ ‘శివమ్’!

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రామ్ ‘శివమ్’!

Published on Sep 22, 2015 3:16 AM IST

Shivam

రామ్ హీరోగా ‘శివమ్’ పేరుతో ఓ హై వోల్టేజ్ లవ్‌స్టోరీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ మధ్యే భారీ ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక ఆడియోకు రెస్పాన్స్ సూపర్‌గా ఉండడంతో సినిమా యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తోంది.

ప్రస్తుతం రామ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. డబ్బింగ్ వర్క్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని, సినిమా బాగా వచ్చిందని రామ్ ఈ సందర్భంగా తెలిపారు. రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా పెద్ద ఎత్తున తెరకెక్కిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ‘శివమ్’ సినిమా అక్టోబర్ 2న విడుదల కానున్న విషయం తెలిసిందే!

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు