జీవిత రాజశేఖర్ కుమార్తె సినిమా ఆగిపోయిందా ?

Published on May 4, 2019 2:00 am IST

జీవిత రాజశేఖర్ ల ఇద్దరు కూతుళ్లు సినిమాల్లో కి ఎంట్రీ ఇస్తున్నారని తెలిసిందే. అందులో భాగంగా పెద్ద కుమార్తె శివాని గత ఏడాది 2 స్టేట్స్ అనే చిత్రాన్ని మొదలు పెట్టింది. నూతన దర్శకుడు వెంకట్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అడివి శేష్ హీరోకాగా శివాని హీరోయిన్. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే అవుట్ ఫుట్ అడివి శేష్ కు నచ్చకపోవడంతో శేష్ సినిమా కు రిపేర్లు చేద్దాం అనుకున్నాడు కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించక పోవడంతో సినిమా ను మొత్తానికే క్యాన్సల్ చేశాడని టాక్ వస్తుంది. ఇక మొదటి సినిమానే ఇలా ఆగిపోవడంతో శివాని అప్సెట్ లో ఉందట.

ఇక మరో వైపు జీవిత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక మొదటి చిత్రం దొరసాని కి మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండ తమ్మడు ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :

More