టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శివ రాజ్ కుమార్

టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శివ రాజ్ కుమార్

Published on Jun 23, 2024 2:00 PM IST

కన్నడ సినిమాలో మంచి క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో కరుణడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ కూడా ఒకరు. మరి కన్నడలో సాలిడ్ మాస్ చిత్రాలు అందించిన శివ రాజ్ కుమార్ రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ హోం “జైలర్” సినిమాలో కనిపించి అదరగొట్టారు. దీనితో తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ తనకి రాగా ఇప్పుడు తన నుంచి టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధం అయ్యింది.

దర్శకుడు కార్తీక్ అద్వైత్ తో కన్నడ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే సినిమాగా ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని అయితే మేకర్స్ అనౌన్స్ చేశారు. భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఎన్ రెడ్డి, సుధీర్ పి లు నిర్మాతలుగా నిర్మాణం వహించనున్నారు. ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ దర్శకుడు సామ్ సి సంగీతం అందించగా గీత శివ రాజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ స్పెషల్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఇక ఈ ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు