సమీక్ష : శివరంజని – బోర్ గా సాగే హారర్ థ్రిల్లర్ !

సమీక్ష : శివరంజని – బోర్ గా సాగే హారర్ థ్రిల్లర్ !

Published on Aug 3, 2019 3:02 AM IST
Shivaranjani movie review

విడుదల తేదీ : ఆగస్టు 02, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2/5

నటీనటులు : రష్మి గౌతమ్, నందు, నందినిరాయ్, అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి త‌దిత‌రులు.

దర్శకత్వం : నాగప్రభాకర్

నిర్మాత‌లు : ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు

సంగీతం : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫర్ : సురేందర్ రెడ్డి

నాగ ప్రభాకర్ దర్శకత్వంలో హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం‘‘శివరంజని’’. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

కార్తీక్ (నందు) ఈవెంట్ ఆర్గనైజర్. అయితే వల్లీ (రష్మి గౌతమ్)కి జరిగిన ఓ యాక్సిడెంట్ కారణంగా వల్లీ, కార్తీక్ జీవితంలోకి వస్తోంది. కానీ వల్లీకి జరిగిన ప్రమాదం వల్ల తన గతాన్ని పూర్తిగా మర్చిపోతుంది. దాంతో కార్తీక్, వల్లీని తన ఇంటికే తీసుకువెళ్తాడు. ఐతే వల్లీని ఎప్పుడూ ఓ నీడ (ఆత్మ) వెంటాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వల్లీ కాస్త మధుమతిగా కార్తీక్ జీవిత భాగస్వామిగా మారే క్రమంలో.. వల్లీకి సంబంధించిన గతం తెలుస్తోంది. వల్లీ గతం ఏమిటి ? అసలు ఆమె గతంలో ఎవరు ? ఇంతకీ ఆమెను ఆత్మ ఎందుకు వెంటాడుతుంది ? ఆమె గత జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ? వాటికి, ఆమెకు జరిగిన ప్రమాదానికి ఏమైనా సంబంధం ఉందా ? చివరికీ కార్తీక్ – వల్లీ ఒక్కటవుతారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఓ ఆత్మ చుట్టూ తిరిగే హారర్ సప్సెన్స్ కాన్సెప్ట్ తో కొన్ని రొమాంటిక్ ఎలిమెంట్స్ తో దర్శకుడు నాగప్రభాకర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన నందు తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా నందు నటన బాగుంది. సినిమాలోని ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హర్రర్ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

ఇక హీరోయిన్ గా నటించిన రష్మి గౌతమ్ కొన్ని హర్రర్ సీన్స్ లో అవలీలగా నటించింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన నందిని రాయ్ నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన అఖిల్ కార్తీక్, ఇంద్ర, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి బాగా నటించారు. ముఖ్యంగా ధన్ రాజ్ తన కామెడీ టైమింగ్ తో కొన్నిచోట్ల నవ్వించాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు నాగప్రభాకర్ సస్పెన్స్ హారర్ కి అలాగే ఓ కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అయితే రాసుకున్నాడు గాని, కథాకథనాల్లో మాత్రం సరైన ప్లోను మెయింటైన్ చేయలేకపోయాడు. అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టి.. పైగా భయపెట్టే అవే సీన్లను అటు తిప్పి, ఇటు తిప్పి.. చాలా టైమ్‌ వేస్ట్‌ చేసారు. సినిమాలో చాలా భాగం రొటీన్‌ హారర్ తంతుగానే ఉంటుంది. క్లైమాక్స్ ను కూడా ఒక హారర్ ఎఫెక్ట్ తో చిన్న ఫైట్ పెట్టి మమ అనిపించేసారు.

అయితే సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ఎలా ఉన్నా.. కొన్ని రొమాంటిక్ ఎలెమెంట్స్ ను మాత్రం బాగానే పెట్టాడు దర్శకుడు. కానీ కథ కథనంలో పట్టు లేకపోవడంతో అవి కూడా తేలిపోయాయి. ముఖ్యంగా పేలని కామెడీ అండ్ హార్రర్ సీన్స్ తో కథను డైవర్ట్ చేసారు. దానికి తోడు ఆ సన్నివేశాలు అన్ని.. ఒకేలా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.

అసలు సినిమాలోని మెయిన్ పాయింట్ లోనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ ను సరిగ్గా ఎలివేట్ చేయలేదు. ఓవరాల్ గా సినిమా ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సాగుతూ బోర్ కొడుతోంది. దర్శకుడు నాగప్రభాకర్ స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు నాగప్రభాకర్ డైరెక్షన్ పరంగా పర్వాలేదనిపించినా… ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది.

ఇక ఎడిటింగ్ బాగుంది. ముఖ్యంగా హారర్ ఎఫెక్ట్ సీన్స్ ను చాల బాగా ఎడిట్ చేశారు. అయితే సెకండాఫ్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. హర్రర్ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు ఏ పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్న నాయుడు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

 

నాగ ప్రభాకర్ దర్శకత్వంలో హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా వచ్చిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కొన్ని రొమాంటిక్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో సాగిన.. సినిమా మాత్రం ఆసక్తికరంగా సాగదు. కథా కథనాల్లో సరైన ప్లో లేకపోవడం, సినిమా ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సాగుతూ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating :   2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు