‘థీమ్ ఆఫ్ క‌ల్కి’ కోసం న‌టి శోభ‌న డ్యాన్స్

‘థీమ్ ఆఫ్ క‌ల్కి’ కోసం న‌టి శోభ‌న డ్యాన్స్

Published on Jun 24, 2024 1:30 PM IST

పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ‘క‌ల్కి 2898 AD’ మ‌రో మూడు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ తో మేక‌ర్స్ బిజీగా ఉన్నారు. ‘క‌ల్కి’ సినిమా నుండి వ‌రుస అప్డేట్స్ ఇస్తూ ఈ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి ‘ధీమ్ ఆఫ్ క‌ల్కి’ అనే సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు.

ఈ క్రమంలోనే ఈ సాంగ్ ను మ‌థురలో రిలీజ్ చేస్తున్న‌ట్లు వారు తెలిపారు. ఈ థీమ్ సాంగ్ కోసం న‌టి శోభ‌న ఓ స్పెష‌ల్ డ్యాన్స్ కూడా చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

‘క‌ల్కి 2898 AD’ మూవీలో ప్ర‌భాస్ హీరోగా నటిస్తుండ‌గా అమితాబ్ బచ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువ‌ల్ వండ‌ర్ మూవీని అశ్విని ద‌త్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు. సంతోష్ నార‌య‌ణ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు