“ఫలక్ నుమా దాస్”కు ఉస్మానియా విద్యార్థుల షాక్

Published on Jun 5, 2019 8:00 pm IST

విశ్వక్ సేన్ టైం ఏం బాగున్నట్టు లేదు. “ఫలక్ నుమా దాస్” సినిమా బాగాలేదు అన్నవారిపై ఆయన స్పందించిన తీరుఈ యంగ్ హీరోను విమర్శలు పాలు చేసింది. ఇవి చాలవన్నట్టు నేడు ఉస్మానియా విద్యార్థులు విశ్వక్ సేన్ కు గట్టిషాక్ ఇచ్చారు. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలపై వాళ్లు తీవ్ర అభ్యన్తరం తెలుపుతున్నారు.

ఫలక్ నామా దాస్ మూవీలో ఉస్మానియా వర్శిటి విద్యార్ధులను హీరో విశ్వక్ సేన్ అవమానించారంటూ ఆ హీరో కార్యాలయాన్ని ముట్టడించారు ఉస్మానియా విద్యార్ధులు.. ఈ మూవీకి విశ్వక్ దర్శకుడి వ్యహరించడంతో పాటు హీరోగానూ నటించాడు.. ఇక ఈ మూవీలో బూతు డైలాగ్స్ పెట్టి విద్యార్ధులు పరువు తీశాడంటూ ధర్నాకు దిగారు. వెంటనే అ మూవీలో బూతు డైలాగ్స్ తో సహా ఉస్మానియా పేరును తొలగించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. ఇప్పడు ఈ వివాదంపై విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తాడో చుడాలిమరి.

సంబంధిత సమాచారం :

X
More