కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైన దళపతి విజయ్ ఇప్పుడు తన ఆఖరి చిత్రం జన నాయగన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత తన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే విజయ్ పొలిటికల్ పనులు, టూర్ లలోనే బిజీగా ఉండగా సినిమా నుంచి ఏ స్టార్ రాజకీయాల్లోకి వెళ్లినా కూడా ఉండే విమర్శలు తనపై కూడా తమిళ నాట పడుతున్నాయి.
కానీ దీనికి మించిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకి వచ్చింది. స్వయంగా విజయ్ భార్య సంగీత అతని నుంచి విడాకులు కావాలని తమిళనాడు ఫ్యామిలీ కోర్ట్ ని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. విజయ్ మరొకరితో (ప్రముఖ సినీ నటి)తో అఫైర్ లో ఉన్నాడు అంటూ ఆమె ఈ పిటిషన్ వేసి అతని నుంచి విడాకులు కోరినట్టు సంచలన వార్త బయటకి వచ్చింది.
అయితే గత కొన్నాళ్ల నుంచే విజయ్ కి సంగీత నడుమ దూరం ఉందని కానీ ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు ఈ విడాకుల ప్రస్తావన తీసుకురావడం అనేది మరో రకంగా చర్చకి దారి తీసింది. మరి ఇది మాత్రం ఒక ఊహించని సంచలన ట్విస్ట్ అనే చెప్పి తీరాలి.
