విడాకులు ప్రకటించి షాకిచ్చిన అమీర్ ఖాన్ దంపతులు.!

Published on Jul 3, 2021 2:00 pm IST

ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు రాబట్టగలిగే అతి తక్కువ మంది స్టార్ నటుల్లో బాలీవుడ్ బిగ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఒకరు. ప్రస్తుతం తన సినిమాల్లో బిజీగా ఉన్న అమీర్ తాజాగా షాకింగ్ వార్తను సినీ వర్గాలు సహా అభిమానులకు అందజేశాడు. తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకుంటున్నట్టుగా అధికారికంగా అమీర్ ఒక ప్రెస్ నోట్ తో తెలియజేసారు.

మరి దీనిలో వారి ఇన్నేళ్ల అనుబంధాన్ని అమీర్ ఒకింత ఎమోషనల్ గానే పొందుపరిచారు. ఈ 15 సంవత్సరాల్లో తాము ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ పంచుకున్నామని, అపారమైన నమ్మకం, గౌరవం మా మధ్య ఎప్పుడూ ఉన్నాయని ఇక నుంచి కూడా ఉంటాయని తెలిపారు. ఇక నుంచి తాము ఇద్దరం తమ జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలను కుంటున్నామని తెలిపారు.

ఇక నుంచి కూడా తాము సన్నిహితంగా తమ కెరీర్స్ చూసుకుంటామని అలాగే తమ కొడుకు ఆజాద్ పట్ల అంకితభావంగానే కొనసాగుతామని తెలియజేసారు. అయితే అమీర్ ఖాన్ నుంచి ఊహించని విధంగా ఈ ప్రకటన రావడంతో ఒక్కసారిగా సినీ వర్గాలు మరియు అభిమానులు షాక్ కి గురయ్యారు.

సంబంధిత సమాచారం :