రెమ్యూనరేషన్ భారీగా పెంచిన అనిల్ రావిపూడి !

Published on Apr 4, 2019 2:20 am IST

ఈ ఏడాది ఎఫ్ 2 తో టాలీవుడ్ కు భారీ హిట్ ఇచ్చాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ విజయాలను అందుకొన్నాడు. దాంతో ఈ డైరెక్టర్ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ను డైరెక్ట్ చేసే ఆఫర్ ను సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ సినిమా కు గాను అనిల్ ఏకంగా 12కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడని టాక్. ప్రస్తుతం ఈచిత్రానికి స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు అనిల్. దిల్ రాజు ,అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :