ధనుష్ “గ్రే మ్యాన్” కి షాకింగ్ బడ్జెట్ అయ్యిందా..?

Published on May 25, 2022 7:46 pm IST

మన ఇండియన్ సినిమాకి చెందిన నటులు హాలీవుడ్ చిత్రాల్లో కనిపించడం అనేది చాలా అరుదు. అయితే అలా ఇప్పుడు ఒక సినిమాలో జస్ట్ ఇలా కనిపించి వెళ్లిపోవడం కాకుండా కీలక పాత్రలో కనిపించనున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు రసో బ్రదర్స్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ డ్రామా “ది గ్రే మ్యాన్” ప్రపంచ వ్యాప్తంగా ఈ జూన్ లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. అయితే నిన్ననే ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చెయ్యగా దానికి భారీ స్థాయి రెస్పాన్స్ వస్తుంది. పైగా ధనుష్ పై చిన్న బిట్ కనిపించింది.

కానీ అది కూడా మంచి ఇంటెన్స్ ఉంది. మరి ఇలా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయి ఉన్న ఈ సినిమా కి షాకింగ్ బడ్జెట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ఏకంగా 1500 కోట్ల మేర బడ్జెట్ అయ్యిందట. అంటే 200 మిలియన్ యూఎస్ డాలర్స్ ఖర్చు చేస్తే గాని ఈ సినిమా పూర్తవలేదట. మొత్తానికి అయితే ఈ షాకింగ్ బడ్జెట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత సమాచారం :