“క్రాక్” స్ట్రీమింగ్ పై గాసిప్ నిజమేనా.?

Published on Jan 16, 2021 3:00 pm IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ కం బ్యాక్ చిత్రం “క్రాక్”. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా వసూళ్లను రాబడుతుంది. అయితే ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయ్యిపోయిన ఈ చిత్రం కు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకు వచ్చింది.

ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” వారు కొనుగోలు చేశారన్న విషయం ఈ మధ్యనే కన్ఫర్మ్ అయ్యినట్టు తెలిసిందే. మరి ఇదే యాప్ లో ఈ చిత్రాన్ని ఈ జనవరిలోనే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేస్తారన్న షాకింగ్ వార్త వినిపిస్తుంది. ఈ జనవరి చివరిలో ఈ సినిమా స్ట్రీమింగ్ వెర్షన్ వచ్చేస్తుంది అని టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఠాగూర్ మధు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More