ప్రముఖ నటుడిని హత్య చేయాలనుకున్నారట !

ప్రముఖ నటుడిని హత్య చేయాలనుకున్నారట !

Published on Jun 27, 2018 8:41 PM IST

తెలుగు , తమిళ , కన్నడ మొదలుగు భాషాల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. గత కొంత కాలంగా సినిమాలకంటే ఎక్కువగా రాజకీయాలలో బిజీ గా గడుపుతున్నారాయన. అయితే ఇటీవల ఆయన స్నేహితురాలు ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యా జరిగిన విషయం తెలిసిందే .

ఈహత్యలో రాజకీయ పార్టీలకు ప్రమేయం ఉందని ఈ కేసు విచారణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు ప్రకాష్ రాజ్. అయితే ఈహత్య కేసును విచారిస్తున్న సిట్ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ కేసులోని దోషులు ప్రకాష్ రాజ్ ను కూడా హత్యా చేయాలనుకున్నారని చెప్పింది. ఈవిషయాన్ని మీడియా లో చూసి తెలుసుకున్న ఆయన ట్విట్టర్లో స్పందిచారు. పిరికి వాళ్లు మీరు.. విద్వేషపూరిత రాజకీయాలనుంచి మీరు తప్పించుకోగలరని అనుకుంటున్నారా అని ట్వీట్ చేశారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు