రిలీజ్ రోజే టీవీలో “వకీల్ సాబ్”..చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్!

Published on Apr 14, 2021 4:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నివేతా థామస్, అంజలి మరియు అనన్య నాగళ్ళలు ప్రధాన పాత్రధారులుగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”.దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సాలిడ్ ప్రమోషన్స్ తో ఈ నెల 9 న సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకోవడంతో మంచి వసూళ్లను రాబడుతూ వస్తుంది.

పవన్ కెరీర్ లోనే బెస్ట్ రీమేక్ గా మరియు అత్యధిక వసూళ్లు రాబడుతున్న చిత్రంగా ఇది నిలిచింది. మరి ఇదిలా ఉండగా కొత్త సినిమా వస్తుంది అంటే పైరసి కూడా ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకే నిర్మాత దిల్ రాజు రిలీజ్ రోజుకి ముందు నుంచే పైరసి లింక్స్ కనబడితే రిపోర్ట్ చెయ్యాలని సూచించారు.

కానీ ఇప్పుడు అనూహ్యంగా పవన్ వకీల్ సాబ్ సినిమా ఏకంగా రిలీజ్ డేట్ నే విజయనగరం లోని ఓ టీవీ కేబుల్ ఛానెల్లో దర్శనం ఇవ్వడం షాక్ ఇచ్చింది. లేట్ గా వెలుగు లోకి వచ్చిన ఈ విషయంపై ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ దిల్ రాజు నిర్మాణ సంస్థను ఆ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని రిలీజ్ రోజునే టెలికాస్ట్ చేసిన ఛానెల్ వీడియోతో డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై దిల్ రాజు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. అయితే ఇంతకు ముందు లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలకు ఇలా జరగ్గా భారీ ఫైన్స్ వేసిన దాఖలాలు ఉన్న సంగతి తెలిసిందే. మరి వీరేం చేస్తారో చూడాలి. అసలే పవన్ కం బ్యాక్ సినిమా కూడా ఇది.

సంబంధిత సమాచారం :