ఖైదీ పై అజయ్ దేవ్‌గణ్ టార్గెట్ !

Published on Aug 4, 2020 3:00 am IST


బాలీవుడ్ నిర్మాతలు ఈ మధ్య దక్షిణాది పరిశ్రమల సినిమాల పై ఆసక్తిగా ఉన్నారు. సినిమా నచ్చితే వెంటనే రీమేక్ రైట్స్ తీసుకుంటున్నారు. అందుకే ఘన విజయాన్ని అందుకున్న తమిళ సినిమా ‘ఖైదీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ చిత్రాన్ని చూసి వెంటనే డేట్స్ ఇచ్ఛేశాడు. కానీ అంతలో కరోనా రావడంతో ఈ సినిమా షూటింగ్ వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని గ్యాప్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లోనే ఖైదీని పూర్తి చేయాలని అజయ్ దేవగణ్ టార్గెట్ పెట్టుకున్నాడట. దాని కోసం సెట్స్ ను కూడా వేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ చేసినా అది ఇప్పుడు సాధ్యం అయ్యేలా లేదు. ఇక కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. కార్తి హీరోగా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. మరి అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More