మహేష్ కూడా వెనక్కి తగ్గాడు !

Published on Apr 11, 2021 4:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ కూడా క్యాన్సల్ అయింది. వచ్చే వారం నుండి కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో.. మహేష్ తన సినిమా షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేశారట. హైదరాబాద్ లోని ఈ నెల 15వ తేదీ నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టి దాదాపు 25 రోజులు పాటు షూటింగ్ ను చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడు ఈ సినిమా కూడా మరింత ఆలస్యం కానుంది.

ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే విషయం తెలిసిందే. అయితే మహేష్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు ప్రస్తుతం. ఈ సెట్ లోనే బ్యాంకు నేప‌థ్యంలో సాగే కీల‌క‌మైన ఎపిసోడ్ తీయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :