డార్లింగ్ ప్రభాస్ ఆమెకు అంతలా నచ్చేశాడు…!

Published on Aug 10, 2019 7:57 pm IST

సాహో భామ శ్రద్దా కపూర్ మొదటిసారి సౌత్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. నాలుగు భాషలలో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ మూవీ ప్రొమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్బంగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన శ్రద్దా సహనటుడు ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తారట. ప్రభాస్ తో కలిసి పనిచేయడం చాలా ఆహ్లాదంగా ఉంటుందన్న ఆమె, ఆయన నైసియస్ట్, స్వీటెస్ట్, లవ్లీ యెస్ట్ పర్సన్ అంటూ కొనియాడారట. అలాగే నిర్మాతలు యూవీ క్రియేషన్స్ కూడా తనను చాలా బాగా చూసుకున్నారు అన్నారు. హైదరాబాద్ షూటింగ్ సందర్భంలో నిర్మాతలు అనేక తెలుగు వంటకాలతో ఆమెకు పెద్ద ట్రీట్ ఇవ్వడం జరిగింది.

పరిశ్రమలో నిగర్వి,నిరాడంబరం, వివాదరహితుడిగా పేరున్న ప్రభాస్ ఎవరినైనా ఆకట్టుకుంటాడు. ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరు ఇదే భావన కలిగివుండటం గమనించదగిన విషయం. కాగా నేడు సాయంత్రం 5గంటలకు సాహో మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :