
యువ నటి శ్రద్ధాదాస్ వెండితెరపై తన ప్రతిభ చూపించడానికి తపన పడుతుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవలే ఈ భామ కొన్ని నెగటివ్ రోల్స్ చేయడం విశేషం.
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు బాగానే వున్నాయి. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ‘గుంటూరు టాకీస్’ చిత్రీకరణ పూర్తయింది. ప్రచార చిత్రం విడుదల చేయడంతో ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తరువాత ‘రాజ్ కోట్’ అనే హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొనడం విశేషం. ఈ చిత్రాలేకాక మరో కన్నడ చిత్రంలో కూడా నటించనున్నట్టు సమాచారం.

